ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో పూర్తి చట్టపరమైన మినహాయింపు పొందుతున్న ఏకైక వ్యక్తి సీఈసీ జ్ఞానేష్ కుమార్ మాత్రమేనని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.