కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని జనాభా గణన కమిషన్.. జనగణనలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజల వాహనాలు,ఆస్తుల కొనుగోళ్లు, పాఠశాలల్లో చేరికలు, ఆధార్, ఓటర్లు మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని హిందూ,ముస్లిం, క్రైస్తవ వర్గాలుగా వర్గీకరించి తెలుసుకోవాలని కోరుతోందని వార్తలొస్తున్నాయి.
రాజ్యాంగంలోని లౌకిక స్వరూపం మతపరమైన వర్గాల కింద సమాచారాన్ని సేకరించడాన్ని నిరోధిస్తున్నందున రాష్ట్రాలు ఈ విషయంలో గందరగోళానికి గురవుతున్నాయి. ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యవహారంపై స్పందించారు.