అరుణాచల్ ప్రదేశ్లోని చాంగ్లాంగ్ జిల్లాలో భారత్-మయన్మార్ సరిహద్దు వెంబడి మంగళవారం (సెప్టెంబర్ 29) ఒక గస్తీ బృందంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో అస్సాం రైఫిల్స్ జవాన్ ఒకరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారని అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.సరిహద్దు కంచె పనులు జరుగుతున్న ప్రాంతంలో 21 అస్సాం రైఫిల్స్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తుండగా,నాంపాంగ్ సర్కిల్ పరిధిలోని నాంపాంగ్ నల్లా సమీపంలో ఈ ఘటన జరిగింది.