తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారానికి దారితీసిన ఒక కీలక నిర్ణయంపై విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సమాచార హక్కు చట్టం పరిధి నుంచి పబ్లిక్ (లా అండ్ ఆర్డర్) శాఖను తప్పిస్తూ కొద్ది రోజుల క్రితం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులను ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది.ఆర్టీఐ చట్టం-2005 లోని సెక్షన్ 24(4) ప్రకారం పోలీసు కాల్పులు, కస్టడీ మరణాలు, చిత్రహింసల విచారణ నివేదికలు వంటి అత్యంత కీలకమైన అంశాలు వస్తాయి.