అల్లూరి జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కు వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొయ్యూరు మండలంలో జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. పాడేరు – జి.మాడుగుల మధ్య డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జీకే వీధి మండలంలో ఇటీవల నిర్మించిన జర్రెల కొత్తూరు కల్వర్టు
కొట్టుకుపోయింది. చింతపల్లి మండలం చౌడుపల్లి పశువులబందా చెరువుకు గండి పడింది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో జనజీవనం
అస్తవ్యస్తంగా మారింది