ఐఐటీ కాన్పూర్ వైద్య డిగ్రీలను అందించేందుకు సిద్ధమవుతున్నప్పటికీ.. మొదటగా MBBS కోర్సును ప్రారంభించబోవడం లేదు. మొదటి దశలో ఉన్నత వైద్య కోర్సులు, అలాగే సూపర్ స్పెషాలిటీ కోర్సులైన DM (Doctorate of Medicine), MCh (Master of Chirurgiae)లను ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. అంటే..సాధారణ వైద్యుడి నుంచి కార్డియాలజిస్ట్, న్యూరోసర్జన్ వంటి స్పెషలిస్టులుగా ఎదగడానికి అవసరమైన ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వైద్యం-ఇంజినీరింగ్ కలయికలో ట్రాన్స్డిసిప్లినరీ పరిశోధన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయాలని ఐఐటీ కాన్పూర్ లక్ష్యంగా పెట్టుకుంది.