తెలంగాణ ప్రజలకు భూముల గురించి నిజాలు తెలియాలని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ తెలిపారు. అందుకే భూములను పరిశీలిస్తున్నామని, నిజాం ఆస్తుల కంటే మాజీ సిఎం కెసిఆర్ కుటుంబ సభ్యులకు ఎక్కువగా ఆస్తులు ఉన్నాయని చామల ఆరోపణలు చేశారు. 2009లేని ఆస్తులు ఇప్పుడు కెటిఆర్‌కు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ రావుకు ఉద్యమ సమయంలో లేని ఫామ్‌హౌస్ ఇప్పుడు ఎలా వచ్చిందని అడిగారు. కెసిఆర్ ఫామ్‌హౌస్ పక్కన మూడు వందల ఎకరాల అసైన్డ్ భూములను దళితులకు ఎందుకు పంచలేదని ప్రశ్నించారు.