వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ మద్యం ఘటనలకు బాధ్యత వహించాలని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై గంటల తరబడి మాట్లాడుతున్న జగన్ మద్యం వ్యవహారంపై ఎందుకు మాట్లాడరని? ఆయన సూటిగా ప్రశ్నించారు. మద్యం విక్రయాల్లో పారదర్శకతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.