టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్లపై నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు తరఫు న్యాయవాది పరువు నష్టం దావా వేశారు. తనపై క్షుద్ర పూజల ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారని హరీష్ రావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకుముందే ఆ ఆరోపణలను ఉపసంహరించుకుని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు.