గ్లోబల్ సెమీ కండక్టర్ తయారీ హబ్ గా భారత్‌ను తయారు చేయడమే లక్ష్యమని ప్రధాని మోడీ అన్నారు. గురువారం ‘సెమీకాన్ ఇండియా 2026’ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చిప్ తయారీపై భారత్ ఫోకస్ పెట్టిందని.. దేశంలో తయారైన చిప్స్ ఇప్పుడు వినియోగదారులకు చేరుతున్నాయని చెప్పారు. సెమీకండక్టర్ తయారీకి ప్రధాన కేంద్రంగా మారే దిశగా భారత్ అడుగులు వేస్తోందని,ఇప్పటివరకు 12 చిప్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని. ప్రధాని పేర్కొన్నారు.