దేశవ్యాప్తంగా TFR గణాంకాలను పరిశీలిస్తే వివిధ రాష్ట్రాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. బీహార్ (2.9), ఉత్తరప్రదేశ్ (2.6), మధ్యప్రదేశ్ (2.4) వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు ఇంకా దేశ సగటు కంటే ఎక్కువగా ఉంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 1.4, తెలంగాణలో 1.5గా నమోదు కాగా, ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో దేశంలోనే అత్యల్పంగా 1.0 TFR నమోదైంది. వివాహ వయస్సు పెరగడం, పట్టణీకరణ, విద్య మరియు ఉద్యోగ అవకాశాలు పెరగడం, మారుతున్న జీవనశైలి వల్ల సంతానోత్పత్తి తగ్గుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.