ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ (SI), కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో సివిల్ విభాగానికి సంబంధించి 253 పోస్టులు, AR విభాగంలో 116, SPF పరిధిలో 9 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. అలాగే 542 సివిల్ కానిస్టేబుల్, 285 ఏఆర్ కానిస్టేబుల్, 158 ఫైర్మెన్, 150 పురుషుల జైలు వార్డర్లు మరియు 21 మహిళా వార్డర్ పోస్టులు ఉన్నాయి.