సింగరేణిలోని 2 ఇంక్లైన్ గనిలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న గోదావరిఖనికి చెందిన యువతి అక్కడ ఓవర్‌మ్యాన్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్ ఆమెను లైంగికంగా వేదిస్తున్నాడు అని సింగరేణి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ,యాజ్యమానం చర్యలు తీసుకోకపోవటం, రవికుమార్‌తో పాటు ఆమె పాలిటెక్నిక్ లెక్చరర్ నవీన్, నిరంతర వేధింపులు తాళలేక ఆ యువతి సెప్టెంబర్ 13వ తేదీన పురుగుల మందు సేవించింది.లెక్చరర్ నవీన్ ఆమెను ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుండి పరారయ్యాడు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ఆమె తుదిశ్వాస విడిచింది.