ప్రఖ్యాత బెంగాలీ నవలా రచయిత శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ 150వ జయంతి వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని, శరత్‌చంద్ర గొప్ప సాహిత్య ప్రతిభను అలాగే సమాజ సంస్కరణల కోసం ఆయన చేసిన నిరంతర కృషిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు భావితరాల యువతకు ఎంతో మార్గదర్శకమని తెలిపారు. నేటి యువత ఆయన సాహిత్యాన్ని మరింత ఎక్కువగా చదివి స్ఫూర్తి పొందాలని ప్రధాని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.