యూపీఐ లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీలు వసూలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్)గా పిలిచే ఈ ఛార్జీలు వ్యాపారులు మాత్రమే చెల్లించాలి. రూ.3,000 లావాదేవీపై రూ.12, రూ.50,000 లావాదేవీపై రూ.200, రూ.75,000 లావాదేవీపై రూ.300 డీపీఆర్ చెల్లించాలి. రూ.75,000 దాటినా సరే.. గరిష్టంగా ఒక లావాదేవీపై రూ.300 మాత్రమే ఛార్జీ ఉంటుంది. అలాగే, యూపీఐ నుంచి బ్యాంకులకు, యూపీఐ అకౌంట్లకు చేసే చెల్లింపులు ఎప్పట్లాగే ఉచితం.