బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేసిన వారిని అరెస్ట్ చేయవద్దని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వారికి నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్ల ఉన్న కేసులో వారిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అరెస్ట్ చేయొద్దని చెప్పినా.. మళ్లీ ఎలా అరెస్ట్ చేస్తారంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.