భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును లక్ష్యంగా చేసుకుని ఓ పాకిస్థానీ సోషల్ మీడియా యూజర్ ఆమె ముఖాన్ని చూడటానికి తన ఫోన్ బ్రైట్నెస్ను 100 శాతానికి పెంచుకోవాల్సి వచ్చిందంటూ చేసిన అభ్యంతరకర వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యపై భారతీయ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వ్యక్తిగత రూపురేఖలపై వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు. “ఆమె భారతదేశ ప్రథమ పౌరురాలు, సాయుధ దళాల సుప్రీం కమాండర్” అంటూ ఓ భారతీయ యూజర్ ఇచ్చిన కౌంటర్ కూడా వైరల్ అవుతోంది.