ఉగ్రవాదులకు నిధులు అందకుండా పాక్ తీసుకున్న చర్యలను సమీక్షించేందుకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని కట్టడి చేస్తున్నామి చెప్పేందుకు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజార్‌ను పట్టించిన వారికి 70 లక్షల రూపాయల రివార్డును పెంచింది. ఈ సమీక్షలో పాక్ విఫలమైతే మళ్లీ ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేరాల్సి ఉంటుంది. దీంతో, అంతర్జాతీయ సంస్థల నిఘా పెరిగి పాక్‌కు ఆర్థిక లావాదేవీలు జరపడం మరింత కష్టంగా మారుతుంది.