తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యారంగంలో ఆధునిక విధానాలు తీసుకొచ్చేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. దేశానికి ఆదర్శంగా నిలబడే విద్యా పాలసీని తెస్తామని ప్రకటించారు. సామాజిక వెనుకబాటుతనానికి కారణం విద్య మాత్రమే కారణమని పేర్కొన్నారు. దేశంలో ఎన్నో ప్రధాన విద్యా సంస్థలకు నెహ్రూ పునాది వేశారని సీఎం కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతి జిల్లాకో యూనివర్సిటీ వచ్చిందని గుర్తు చేశారు.