దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన బొల్లారంలోని, 20 మద్రాస్ రెజిమెంట్ బెటాలియన్ ఆయుధాల చోరీ కేసులో.. ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇంతకుముందే నలుగురు గార్డులను (అగ్నివీర్) విచారించగా. ముగ్గురు సీనియర్ అధికారులను విచారణ నిమిత్తం ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది. ఈ ఆయుధాల చోరీ ఒక్కరోజులో జరిగింది కాదని, గత మూడు నెలలుగా పక్కా వ్యూహంతో ఒక్కొక్కటిగా మాయం చేసినట్లు విచారణలో వెల్లడైంది.