మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ లో గురువారం తెల్లవారుజామున ఓ వ్యక్తి సహా 200లకు పైగా మేకలు సజీవ దహనమయ్యాయి. ఈ ఘటనలో డీసీఎం వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే.. జాతీయ రహదారిపై కర్నూలు మార్గంలో మేకల లోడుతో వెళ్తున్న డీసీఎం.. రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొంది. దీంతో వాహనంలో మంటలు చెలరేగి క్షణాల్లో కాలిపోయింది. వ్యాన్లో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.