ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అవుతుండగా ఒక డ్రోన్ అతిసమీపంలోకి వచ్చింది. ఢీకొట్టుకునేంత దగ్గరగా వచ్చిందని నార్వే ప్రధాని జోనాస్ స్టోర్ వెల్లడించారు. నార్వే రాజు కింగ్ హెరాల్డ్ అంత్యక్రియల కోసం జెలెన్స్కీ మాల్డోవా దేశం నుంచి నార్వే రాజధాని ఓస్లోకు వెళ్లారు. ఈ సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మాల్డోవా నుంచి విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో డ్రోన్ ఢీకొట్టబోయింది.