వైకాపాకు రాజీనామా చేసిన అనంతరం చిన్న శ్రీను తెదేపాలో చేరారు. ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో అనుచరులతో కలిసి పసుపు కండువా కప్పుకొన్నారు. శ్రీను కుమార్తె సిరి సహస్ర, ఆమె అనుచరులు కూడా తెదేపాలో చేరారు. పార్టీలో చిన్న శ్రీను చేరిక కార్యక్రమానికి మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, కొండ్రు మురళి, కోళ్ల లలితకుమారి తదితరులు హాజరయ్యారు.