ప్రముఖ యూట్యూబర్ నందన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. విచారణ సమయంలో నందన తన వాదనను గట్టిగా వినిపించారు. తాను కేవలం ఒక ఐటీ ఉద్యోగిని మరియు యూట్యూబర్‌ని మాత్రమేనని స్పష్టం చేశారు. వీసాల కన్సల్టెన్సీకి, దాని ఆర్థిక లావాదేవీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కంపెనీ వ్యవహారాలన్నీ తన భర్త మధుకరే చూసుకుంటారని, ఆ సంస్థలో తాను ఎటువంటి హోదాలోనూ లేనని ఆమె విచారణలో వెల్లడించారు.