సౌదీ అరేబియాపై యెమెన్‌కు చెందిన, ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడుల్లో 73 మంది గాయపడ్డారని రియాద్ నేతృత్వంలోని కూటమి మంగళవారం తెలిపింది, అలాగే ఈ దాడులకు తగిన విధంగా స్పందిస్తామని ప్రకటించింది. “పౌర మరియు ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని హూతీ ఉగ్రవాద మిలీషియా జరిపిన విచక్షణారహిత దాడుల” వల్ల “73 మంది పౌరులు గాయపడ్డారని” కూటమికి చెందినసంయుక్త దళాల కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది.