ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడికి కాంగ్రెస్ శ్రేణులు బయల్దేరారు. కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నఫళంగా అసెంబ్లీ నుంచి ఎర్రవెల్లికి బయల్దేరారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు.హకీంపేట వద్ద వారి వాహనాలను ఆపి అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు.
ఈ క్రమంలో పోలీసులతో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద అగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులు తమ వాహనాలను అడ్డుకోవడంతో బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవెల్లివైపు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు పాదయాత్రగా బయల్దేరారు.