పార్లమెంట్ ప్రోరోగ్ కాకపోవడంపై ప్రతిపక్షం కాంగ్రెస్.. ఇవాళ మరోసారి కేంద్రానికి ఈ విషయాన్ని గుర్తుచేసింది. పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేసి నేటికి సరిగ్గా 25 రోజులు అయ్యింది. కానీ దానిని ఇంకా ప్రొరోగ్ చేయలేదంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ గుర్తుచేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసినా ప్రోరోగ్ చేయకపోవడం (నిరవధికంగా వాయిదా వేయడం)తో ఇదంతా డీలిమిటేషన్ బిల్లును నెగ్గించుకునేందుకే అన్న చర్చ సాగుతోంది. త్వరలో పార్లమెంట్ ప్రత్యేక భేటీ నిర్వహించి డీలిమిటేషన్ బిల్లు నెగ్గించుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.