ఉక్రెయిన్‌పై రష్యా వరుసగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఉక్రెయిన్‌పై దాడుల్ని మూడు రోజులపాటు నిలిపివేయాల్సిందిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. శనివారం నుంచే ఈ ఆదేశాలు అమలవుతాయని పేర్కొన్నారు. దీనికి కారణం.. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ రష్యాలో పర్యటిస్తున్నారు. వారి రాక సందర్భంగా ఎలాంటి ఘర్షణ వాతావరణం ఉండకూడదనే ఉద్దేశంతో పుతిన్.. ఉక్రెయిన్‌పై దాడుల్ని నిలిపివేయాలని సైన్యాన్ని ఆదేశించారు.