మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. మెగా డీఎస్సీ స్కాంలో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ సాక్ష్యాలు బయటకు వస్తున్నా, ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? అంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మెగా డీఎస్సీ ఒక దగా డీఎస్సీ అని తేలిపోతుంటే ఈ స్కామ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ చేత రాజీనామా చేయించకుండా .. అబద్ధాలు చెప్తూ కొడుకును ఎందుకు కాపాడుతున్నారు చంద్రబాబు అంటూ ప్రశ్నించారు.