ఇవాళ మధ్యాహ్నం 3:30 నుండి 4:30 గంటల మధ్య కురిసిన భారీ వర్షం కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొత్తం తొమ్మిది విమానాలను దారి మళ్లించారు. నాలుగు విమానాలను జైపూర్‌కు, మరో నాలుగు లక్నోకు, ఒక విమానాన్ని అహ్మదాబాద్‌కు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఇందిరాగాంధీ విమానాశ్రయంలో భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో ఆ నీటిలోనే ప్రయాణికులు అటు ఇటూ తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.