న్యూయార్క్ సిటీ పబ్లిక్ స్కూల్స్‌లోని విద్యార్థులు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడటంపై సంవత్సరం పాటు నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మామ్దానీ, స్కూల్స్ ఛాన్సలర్ కమార్ హెచ్. శామ్యూల్స్ ప్రకటన చేశారు. అమెరికాలోనే అతిపెద్ద ప్రభుత్వ పాఠశాలల నెట్వర్క్ అయిన న్యూయార్క్‌లో, 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి రానుంది. యంత్రాలపై ఆధారపడకుండా పిల్లలు సొంతంగా ఆలోచించే సామర్థ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.