చిన్న చితక కంపెనీల నుంచి అంతర్జాతీయ కంపెనీలు, ఐటీ, టెక్నాలజీ, మల్టీ నేషనల్ కంపెనీల్లో కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. తాజాగా ఫేమస్ అంతర్జాతీయ క్యాబ్ సేవల కంపెనీ ఉబర్ టెక్నాలజీస్ సంస్థని నమ్ముకొని ఉన్న కొన్నివేల మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సంస్థ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పదిశాతం ఉద్యోగులను ఇంటికి పంపింది. అంటే సుమారు 3,300 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా అధికారిక సమాచారం అందించారు.