ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నరసరావుపేట మండలం కాకాని గ్రామం సమీపంలో ఉన్న జేఎన్టీయూ కాకినాడ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ నూతనంగా నిర్మించిన వసతి గృహాలను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. సుమారు 1,600 మంది విద్యార్థినీ విద్యార్థులకు వసతి కల్పించేందుకు రూ.70 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక హాస్టల్ భవనాలను నిర్మించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి లోకేశ్ ఆవిష్కరించారు