మైనర్ బాలికపై ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ అత్యాచారం చేశాడన్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడం నగరంలో కలకలం రేపింది సీరియస్‌గా పరిగణించిన ఎంఐఎం పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీపై వేటు విధించడం నగరంలో సంచలనం సృష్టించింది. సస్పెన్షన్‌కు సరైన కారణాలను పార్టీ వెల్లడించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అత్తాపూర్‌లో ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విషయం తెలుసుకున్న స్థానికులు సదరు ఎమ్మెల్సీని పట్టుకుని చితకబాదినట్లు సమాచారం ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాకపోవడం విశేషం.