పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో నడిబొడ్డున ఉన్న చెర్లోపల్లి గ్రామంలో నిత్యం జరుగుతున్న అక్రమ గ్రానైట్ క్వారీ బ్లాస్టింగ్ ల కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. శనివారం గ్రామానికి చెందిన ఈశ్వర్ యాదవ్ అనే రైతు తన పొలంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నుతుండగా.. సమీపంలో అక్రమ బ్లాస్టింగ్ జరిపారు.ఆ పేలుడు ధాటికి భారీ క్వారీ రాయి తీవ్రమైన వేగంతో వచ్చి.. పొలం దున్నుతున్న రైతు పక్కనే పడి పెద్ద గుంత పడటంతో, కొద్దిలో ప్రాణాలు పోయేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.