సోనియా గాంధీ తాజా పుస్తకం ‘Belonging : A Journey of Love’ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ముద్రించనుందని వస్తున్న వార్తలను ఆ సంస్థ తోసిపుచ్చింది. శుక్రవారం ఓ ప్రకటనలో తాము Belongingను ప్రచురించడం లేదని పెంగ్విన్ ప్రకటించింది. ఆ పుస్తకంలో కొన్ని మార్పుల చేసేందుకు సోనియా నిరాకరించారనే వార్తల నేపథ్యంలో స్పష్టతనిచ్చిందీ సంస్థ. ఇదిలాఉండగా.. అమెరికాలోని దిగ్గజ ముద్రణ సంస్థకు చెందిన అల్ఫ్రెడ్ ఏ నాఫ్స్ నవంబర్ 10వ తేదీన సోనియా గాంధీ పుస్తకం విడుదల అవుతుందని చెప్పారు.