వరదల్లో గల్లంతైన వారికోసం నేపాల్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ ను ముమ్మరం చేసింది.నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఇద్దరు కవల పిల్లలను జవాన్లు కాపాడారు. మహిళా సైనికులు వారిని ఎత్తుకొని అమ్మలా లాలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న నేపాల్ ఆర్మీ సేవలపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.