ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని పురాతన నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో నోవాంగ్(కొత్త పంటల)తో పూజలు నిర్వహించారు. తమ పంట పొలాల్లో పండించిన చిరు ధాన్యాలతో పాటు పప్పు దినుసులతో ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించారు.కొత్తగా పండించిన పంటలను మొదటగా తమ కుల పెన్ దేవతలకు సమర్పిస్తామని, ఆ తర్వాతే తాము తింటామని ఆదివాసీపెద్దలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకటరావ్ మెస్రం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.