ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు సాంకేతిక, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న ఢిల్లీలోని సేవా భవన్‌లో కేంద్ర జల సంఘం (CWC) చైర్మన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొని చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగానే కేంద్రం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

