టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు మరణం పట్ల ఆయన మిత్రుడు, హీరో చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. నారాయణ రావుతో కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ.. నా ఆత్మీయ మిత్రుడు నారాయణరావు గారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి ‘ అని చిరంజీవి ఒక పోస్ట్ పెట్టారు

