అమెరికా రక్షణ, ఆర్థిక, వైజ్ఞానిక రంగాలే లక్ష్యంగా చైనా ప్రభుత్వ మద్దతుతో సాగుతున్న ఒక భారీ అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్‌ను అమెరికా భద్రతా సంస్థలు విజయవంతంగా భగ్నం చేశాయి. అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), జస్టిస్ డిపార్ట్‌మెంట్ (DOJ) సంయుక్తంగా ఒక రహస్య సాంకేతిక ఆపరేషన్‌ను చేపట్టి, హాకర్లు ఉపయోగిస్తున్న ప్రధాన ఇంటర్నెట్ డొమైన్‌లను స్వాధీనం చేసుకున్నాయి. చైనా హాకర్లు ‘QScan’, ‘QTRouter’ అనే రెండు ప్రమాదకరమైన హ్యాకింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి ఈ దాడులకు పాల్పడ్డారు.

