ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) డిగ్రీ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదుకు మరింత సమయం కల్పించింది. తొలుత ఆగస్టు 23తో ముగియాల్సిన వెబ్ ఆప్షన్ల గడువును ఆగస్టు 27 వరకు పొడిగించింది.
ఆగస్టు 27 తర్వాత మరోసారి గడువు పొడిగింపు ఉండదని సమాచారం. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 28న ఇప్పటికే నమోదు చేసిన వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 2న సీట్ల కేటాయింపు ఫలితాలను ప్రకటించనున్నారు.