<మౌలిద్ (అరబ్బీ :مولد) లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం. ఇది ఇస్లామీయ కేలండర్ లోని మూడవ నెల ‘రబీఉల్-అవ్వల్’ 12వ తేదీన వస్తుంది.
మౌలిద్ అనునది సాధారణంగా జన్మదినోత్సవం కొరకు వాడుతారు. ఈజిప్టు, దక్షిణాసియాలో ఇది సర్వసాధారణపదం. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా ‘మౌలిద్’ గా జరుపుకుంటారు. భారతదేశం సాధారణంగా జరుపుకొనే ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే.