గినియా రాజధాని కొనక్రిలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా ‘దార్ ఎస్ సలామ్’ ప్రాంతంలో ఉన్న భారీ చెత్త డంపింగ్‌యార్డ్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఎంతో ఎత్తులో కొండలా పేరుకుపోయిన చెత్త వర్షపు నీటితో తడిసి బరువెక్కడంతో పక్కనే ఉన్న నివాసాల మీదకు పడింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చెత్త దిబ్బలు కింద పడటంతో అక్కడే ఉన్న పూరి గుడిసెలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

