అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాజకీయ కారణాలతోనే తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిందని తెలిపారు. అనుమతి నిరాకరించడంతో బోస్టన్‌కు వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. ఈ అంశంలో తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. విదేశాంగ శాఖ అధికారులు స్పందిస్తూ సీఎం పర్యటన ఉద్దేశాలపై స్పష్టతలేదని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.