బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్యాంకు బ్రాంచ్ లలో రెగ్యులర్ ప్రాతిపదికన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 2,482 బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 80 పోస్టులు, తెలంగాణలో 50 పోస్టులు ఉన్నాయి. అర్హత:ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.సెప్టెంబరు 7, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.