ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో 2 తుపానులు కొనసాగుతున్నాయి… ఒకటి సాడెల్, ఇంకోటి లాలా. ఇక ఇదే పసిఫిక్ సముద్రంలో రెండు వాయుగుండాలు, 5 అల్పపీడనాలు కూడా ఏర్పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావం నేరుగా ఇండియాపై లేకపోయినా పరోక్షంగా వర్షాలను ప్రభావితం చేస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆగస్ట్ 22 నుండి 26 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు కూడా చెబుతున్నారు.