నిజామాబాద్ మీదుగా షిరిడీ వెళ్తున్న ట్రైన్ లో 24 కిలోల ఎండు గంజాయి పట్టుకున్నారు. పోలీసులు ట్రైన్ చెకింగ్ చేయగా సూట్ కేస్ లలో 24.3 కిలోల ఎండు గంజాయి కనిపించింది. ఒడిశా నుండి షిర్డీకి రవాణా చేస్తున్నట్టు నిందితులు విచారణలో అంగీకరించారు. పేరు తెలియని వ్యక్తి తమకు 10 వేల రూపాయలు ఇచ్చి షిర్డీలో ఒక ప్లేస్ వద్ద ఆటో ఆగి ఉంటుంది ఆ ఆటోలో పెట్టి రావాలని చెప్పినట్టుగా తెలిపారు. నిందితులు గణేష్, దీపక్ సాహులను పోలీసులు అరెస్ట్ చేసారు