హైదరాబాద్ నగరంలో భూముల ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పాన్ మక్తాలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 5.25 ఎకరాల స్థలానికి తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ఈ-వేలం నిర్వహించగా, ఎకరం రూ. 264 కోట్ల రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఇదే సర్వే నంబరులో జరిగిన వేలంలో ఎకరం రూ. 237 కోట్లు పలకగా, తాజాగా ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోవడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో సంచలనం రేపుతోంది.