ఫిఫా ప్రపంచకప్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న గియనీ ఇన్‌ఫాంటినో పదవీ త్వరలోనే ఊడేలా ఉంది. వివాదాస్పద నిర్ణయాలతో ఈమధ్య తరచూ అభిమానుల ఆగ్రహం చవిచూస్తున్న ఇన్‌ఫాంటినో రాజీనామా చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. వరల్డ్‌కప్ లాభాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలనే ఫిఫా చీఫ్ నిర్ణయంపై భగ్గుమంటున్న ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా అతడి రాజీనామా కోసం కదం తొక్కారు. భవిష్యత్‌లో నిర్వహించే ఫిఫా వరల్డ్‌కప్‌ల ద్వారా వచ్చే లాభాలను ప్రైవేట్ పెట్టుబడుదారులకు ఇవ్వాలనుకుంటున్న గియానీ ఇన్‌ఫాంటినో ప్రయత్నాలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.